జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధత, బాధ్యత, ప్రజలకు మంచి చేయాలనే తపనను తాను గమనిస్తున్నానని తెలిపారు.
పవన్ చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతారని.. ఆయన వేసే ప్రతి అడుగు పదిమందికి మేలు చేయాలనే ఆలోచనతోనే ఉంటుందని చిరంజీవి అన్నారు. తన కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ చూపిస్తారని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు.
ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. మారుమూల ప్రాంతాల అభివృద్ధిపైనా పవన్ దృష్టి సారిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. తమ్ముడిని ఈ విధంగా ప్రజాసేవలో చూడటం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కల్యాణ్ ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















