ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ (OpenAI) తన భారత్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లో సంస్థ బాధ్యతలను ప్రభ్‌జీత్ సింగ్‌కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ నుంచి ప్రభ్‌జీత్ సింగ్ ఓపెన్‌ఏఐ భారత్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌ను ఓపెన్‌ఏఐకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా శామ్ ఆల్ట్‌మన్ ఇప్పటికే భావిస్తున్నారని సమాచారం.
భారత్‌లో తమ ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. ప్రభ్‌జీత్ సింగ్ కంపెనీ కన్జ్యూమర్ గ్రోత్, ఎంటర్‌ప్రైజ్ అడాప్షన్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, అలాగే రెగ్యులేటరీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
ఆయన నాయకత్వంలో భారత్‌లోని వినియోగదారులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వ రంగాలకు ఓపెన్‌ఏఐ సేవలు మరింత విస్తరించి ప్రయోజనకరంగా మారుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఓపెన్‌ఏఐ ఇప్పటికే 2025లో దిల్లీలో తన తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభ్‌జీత్ సింగ్ గతంలో ఉబర్‌లో 11 సంవత్సరాలు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ కొత్త బాధ్యతను స్వీకరించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















