భద్రతా ప్రోటోకాల్‌ను సైతం పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఓ రిసార్ట్‌లో ఉన్న వివాహ వేడుకకు హాజరైన అతిథుల వద్దకు స్వయంగా వెళ్లారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన రాకతో ఏర్పడిన అసౌకర్యానికి అక్కడి వారికి క్షమాపణలు కూడా చెప్పారు.
ఉత్తర బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రచారాలు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 12న ప్రధాని మోదీ సిలీగుడీకి చేరుకుని బగ్డోగ్రా విమానాశ్రయం నుంచి సుమారు 13 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించారు.
తరువాత ఆయన బస కోసం సిలీగుడీ సమీపంలోని ‘మేఫెయిర్ టీ రిసార్ట్’లో ఏర్పాట్లు చేశారు. ప్రధాని రాకతో ఆ ప్రాంతమంతా కఠిన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఇదే రిసార్ట్‌లో ఓ పారిశ్రామికవేత్త కుమారుడి వివాహం జరుగుతుండటంతో పెళ్లి అతిథులు భద్రతా తనిఖీల కారణంగా అసౌకర్యానికి గురయ్యారు.ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ స్వయంగా అతిథుల వద్దకు వెళ్లి వారికి క్షమాపణలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















