తృణమూల్ కాంగ్రెస్‌పై (తృణమూల్ కాంగ్రెస్) రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని మెస్సి టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది లియోనెల్ మెస్సి భారత పర్యటన సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ వివాదం మళ్లీ చర్చకు వచ్చింది.
సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన సంఘటన తర్వాత తన మూడేళ్ల కృషి వృథా అయిందని, టీఎంసీ తన ప్రతిష్టను దెబ్బతీసిందని శతద్రు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో ఆయన వరుస పోస్టులు చేస్తూ, “ఎన్నికల్లో ఓటమి మీకు శిక్ష కాదు. నేను కోర్టులో న్యాయం సాధిస్తా. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తా” అని పేర్కొన్నారు.
ఈ వివాదంలో పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిస్వాస్పై కూడా శతద్రు విమర్శలు గుప్పించారు. స్టేడియంలో ఫొటోలు తీసేందుకు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అదే కారణంగా అభిమానుల్లో ఆగ్రహం చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
గతేడాది ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి కోల్‌కతాకు వచ్చిన సమయంలో, స్టేడియంలో ఆశించినంత సమయం గడపకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో శతద్రు అరెస్టై 37 రోజులు జైలులో గడిపారు.
త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తూ విలేకరుల సమావేశం నిర్వహిస్తానని శతద్రు దత్తా తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















