మహిళలపై గృహహింస, దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక పరిష్కార కేంద్రాలు (OSCలు) సమర్థంగా పనిచేయడం లేదని Rahul Gandhi విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రత అనేది ఒక పథకం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని రాహుల్ పేర్కొన్నారు. హింస నుంచి బయటపడి OSCలను ఆశ్రయించే మహిళలకు తగిన సహాయం అందకుండా కేంద్రాలు ఎందుకు మూసివేస్తున్నాయో ప్రశ్నించారు. సిబ్బంది కొరత, ఫిర్యాదుల నిర్లక్ష్యం వంటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తే, ప్రతి ఐదుగురిలో ముగ్గురికి సహాయం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అలాగే మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల్లో చాలా తక్కువ భాగమే OSCలకు వెళ్తోందని విమర్శించారు.
ఈ అంశాన్ని ఆయన ఇటీవల పార్లమెంటులో కూడా లేవనెత్తారు. దీనికి స్పందిస్తూ కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి Savitri Thakur లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. OSCలు ‘మిషన్ శక్తి’లో భాగమని, 2015 ఏప్రిల్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు 13.37 లక్షలకుపైగా మహిళలకు సహాయం అందించామని తెలిపారు.అదేవిధంగా, ఈ కేంద్రాల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలదేనని ఆమె స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















