బ్యాటర్, కెప్టెన్, వికెట్‌కీపర్, కోచ్, మెంటార్ ఇలా తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఐరోపా టీ20 లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా మారారు.
ఈ ఏడాది ఆగస్టులో ఆరు ఫ్రాంఛైజీలు పాల్గొనే ఐరోపా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇది ఐరోపాలో ఐసీసీ ఆమోదం పొందిన తొలి బహుళ దేశాల క్రికెట్ టోర్నీగా నిలవనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ సంఘాలు ఈ లీగ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ లీగ్‌పై స్పందించిన ద్రవిడ్ మాట్లాడుతూ, ఐరోపాలో క్రికెట్‌ను పునాది స్థాయి నుంచి అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్థానిక యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడే అవకాశం లభించడం ఈ టోర్నీ ప్రత్యేకతగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ లీగ్ క్రికెట్ అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీ20 క్రికెట్‌లో మారుతున్న ఆట తీరుపై కూడా ద్రవిడ్ స్పందించారు. గత కొన్నేళ్లలో బ్యాటింగ్ నాణ్యత గణనీయంగా పెరిగిందని, బ్యాటర్లు విభిన్న షాట్లతో దూకుడుగా ఆడుతున్నారని చెప్పారు. వారిని ఎదుర్కోవాలంటే బౌలర్లు కూడా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ ఐరోపా టీ20 లీగ్‌లో ఫ్రాంఛైజీ కొనుగోళ్లలో మాజీ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా భాగమయ్యారు. అభిషేక్ బచ్చన్ ఈ లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారు. ఐరిష్ వోల్ఫ్స్ జట్టును మ్యాక్స్‌వెల్, ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌ను స్టీవ్ వా, ఎడిన్‌బరో క్యాజిల్ రాకర్స్‌ను మెక్‌కలమ్ మరియు కైల్ మిల్స్, గ్లాస్గో కాస్మిక్ జట్టును జాంటీ రోడ్స్, డుప్లెసిస్, క్లాసెన్ కలిసి యజమాన్యంగా వ్యవహరిస్తున్నారు.
అలాగే స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ శాంట్నర్, లివింగ్‌స్టన్ వంటి ప్రస్తుత అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు మెక్‌కలమ్, రోడ్స్, డుప్లెసిస్, క్లాసెన్ వంటి మాజీ ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో పాల్గొననున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















