మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కష్టపడకుండా ఏదీ రాదని, తనయుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం ఎంతో కష్టపడి ప్రేక్షకుల చేత “పెద్ది” అనిపించుకుంటున్నాడని ఆయన అన్నారు. తామంతా కష్టాన్నే నమ్ముకున్నామని, షార్ట్‌కట్‌లకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదని స్పష్టం చేశారు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్’ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “‘పెద్ది’లో రామ్‌చరణ్ నటించలేదు… జీవించాడు. అందుకే ఇక చిరంజీవి కాదు… చరణ్‌జీవి” అని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన కాన్‌క్లేవ్‌లో చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్”గా అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి అవకాశాలు తనకు రాలేదని, కానీ తన కుమారుడికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
చరణ్ ఎదుగుదలపై గర్వంగా ఉందని చెప్పిన చిరంజీవి, “బిడ్డలు ముందుకు వెళ్తున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం” అన్నారు. ‘రంగస్థలం’, ‘పెద్ది’ వంటి సినిమాల్లో చరణ్ నటన తనకు పుత్రోత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ, ‘పెద్ది’ను మట్టి మనుషుల కథగా అద్భుతంగా తీర్చిదిద్దారని, ఇలాంటి కథ తీసేందుకు ఎంతో ధైర్యం కావాలని ప్రశంసించారు. నిర్మాత సతీశ్ కిలారు సహా చిత్ర బృందాన్ని కూడా అభినందించారు.
రామ్‌చరణ్ పాత్రలో పూర్తిగా లీనమై నటించిన తీరు చూసి గర్వపడుతున్నానని, నటుడిగా అతడిని అభినందిస్తున్నానని చిరంజీవి తెలిపారు. “కళ్లతో నటించి ప్రేక్షకులకే కన్నీళ్లు తెప్పించిన నటుడు రామ్‌చరణ్” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
తన కెరీర్ తొలినాళ్లలో తాను కూడా ఇలాగే కష్టపడ్డానని గుర్తుచేసుకున్న చిరంజీవి, ఇప్పుడు చరణ్ పడుతున్న కష్టం చూస్తే తన తండ్రి గుర్తొస్తున్నారని అన్నారు. డబ్బు కోసం కాకుండా, పని చేయడంలో ఉన్న ఆనందం కోసమే సినిమాలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. #RC17 గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆసక్తికరంగా స్పందిస్తూ, “నేను చెప్పను… మీ ఊహకే వదిలేస్తున్నా” అని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















