బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త మార్గదర్శకాల ముసాయిదాను త్వరలో విడుదల చేయనున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
కొత్త నిబంధనల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలను వివిధ వర్గాలుగా విభజించి, వాటి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. టాటా సన్స్ లిస్టింగ్ అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
బ్యాంకుల బోర్డుల పనితీరును మెరుగుపరచడానికి కూడా ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది. వ్యూహాత్మక నిర్ణయాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై మరింత దృష్టి పెట్టేలా మార్గదర్శకాలను సవరించనుంది. ఇప్పటివరకు ఉన్న దాదాపు 9,000 నియంత్రణ నిబంధనలను కుదించి, 238 మాస్టర్ డైరెక్షన్లుగా మార్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇది వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.
అదేవిధంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) మరింత ఆర్థిక సహాయం అందించేందుకు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్‌లో సడలింపులు ఇవ్వనున్నారు. ముందస్తు తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా వీరి భాగస్వామ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు, మనీ మార్కెట్ పరిధిని విస్తరించేందుకు ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా అవకాశాలు కల్పించనున్నారు. ఈ నిర్ణయాలతో దేశీయ ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, వ్యాపార వృద్ధికి తోడ్పడనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















