రాష్ట్రంలోని భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలతోపాటు నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు.
వనపర్తి కలెక్టరేట్‌లో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రీ-సర్వే అంశాలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-సర్వే పురోగతి, భూముల రికార్డుల నవీకరణ, రైతుల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు.
భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా భూములు కలిగిన ప్రతి ఒక్కరికీ ఎల్‌పీఎం నంబర్లతో కూడిన భూధార్ కార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. రీ-సర్వే ద్వారా దీర్ఘకాలంగా పరిష్కారం కాని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో ఏర్పడుతోందన్నారు.
రీ-సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు సుమారు 1,400 అధునాతన రోవర్లను ప్రతి జిల్లాకు అందించినట్లు చెప్పారు. 5,558 మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి, మెరుగైన వేతనంతో ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ సరైన టైటిల్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూముల రికార్డుల స్పష్టత, హక్కుల నిర్ధారణలో రీ-సర్వే కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.50 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి తెలిపారు. రెండో విడతలో భాగంగా గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















