తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు ఒకే రోజు రెండు కీలక షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు రెబల్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా మరికొంత మంది కీలక నేతలు తమ వర్గంలో చేరారని వారు వెల్లడించారు.
మమతకు అత్యంత సన్నిహితుడిగా భావించే కోల్‌కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబల్ గ్రూపు నాయకుడు రితబ్రత బెనర్జీ తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కోల్‌కతా న్యూటౌన్‌లో రెబల్ ఎమ్మెల్యేలు, నేతలు భారీ స్థాయిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుమారు 500 మంది జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు రితబ్రత బెనర్జీ ప్రకటించారు. 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఆ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
‘తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్’ అని రెబల్ వర్గం స్పష్టం చేసింది. తమ నిర్ణయాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని కూడా ప్రకటించింది. మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును ప్రధానంగా ప్రదర్శించగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ చిత్రాలను తొలగించారు. ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















