కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు.
కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ధ్రువీకరించింది.
జార్జి కురియన్ ఇప్పటివరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పాడి, పశుపోషణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రైస్తవ మంత్రి అయిన కురియన్ పదవీకాలం జూన్ 21తో ముగిసింది.
అలాగే మరో మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను కూడా ఈసారి రాజ్యసభకు భాజపా నామినేట్ చేయని విషయం తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















