గతేడాది దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ‘ఆపరేషన్ హెవెన్లీ హింద్’ పేరిట దేశంలో భారీ ఉగ్ర కుట్రకు నిందితులు పాల్పడినట్లు వెల్లడించింది.
2025 నవంబర్ 10న దిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ఐఏ 7500 పేజీల ఛార్జ్‌షీట్‌ను దిల్లీ కోర్టుకు సమర్పించింది. ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చింది.దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. 588 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా పరికరాల నుంచి కీలక సాక్ష్యాలను సేకరించింది.
నిందితులకు అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అనుబంధ సంస్థతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ తెలిపింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా ఈ కుట్ర సాగిందని పేర్కొంది.అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థంగా పేరుగాంచిన టీఏటీపీ (ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్)ని నిందితులు ల్యాబ్‌లలో తయారుచేసినట్లు దర్యాప్తులో తేలింది. దీన్నే ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలుస్తారు. రాకెట్లు, డ్రోన్ ఆధారిత ఐఈడీలతో కూడా ప్రయోగాలు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















