అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉపమాక వెంకన్న ఆలయంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ జె.మురళి తెలిపిన వివరాల ప్రకారం ఒంటిగంట తర్వాత ఆలయంలోకి చొరబడిన నిందితులు ముందుగా ఉత్సవమూర్తులు, ఆండాళ్లమ్మవారి సన్నిధి ఎదురుగా ఉన్న హుండీల వద్దకు చేరుకున్నారు.
విద్యుత్ బోర్డుకు కట్టర్ ఉపయోగించి హుండీలను తెరిచి అందులోని నగదు, బంగారం, వెండి సామగ్రిని రెండు సంచుల్లో నింపుకున్నారు. అనంతరం మూలవిరాట్ సన్నిధి తలుపులు తెరవడానికి ప్రయత్నించగా అవి తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ భద్రతా సిబ్బంది, అర్చకులు ఆలయాన్ని పరిశీలించగా చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.5 లక్షల వరకు నగదు, ఆభరణాలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం పోలీసు బృందాలు ఆలయం వెనుక ఉన్న ఓ తోటలో అనుమానాస్పద మూటను గుర్తించాయి. అందులో సుమారు ఐదు తులాల బంగారం, 2.7 కిలోల వెండి లభ్యమయ్యాయి. పరారవుతున్న సమయంలో నిందితులు ఈ మూటను పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ భద్రత లోపాలపై అధికారులు సమీక్ష ప్రారంభించారు. ఘటనపై రాష్ట్ర మంత్రి అనిత పోలీసు అధికారులతో మాట్లాడి, నిందితులను త్వరగా పట్టుకోవాలని ఎస్పీని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















