మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నియంత్రించడంతో ప్రమాదం తప్పింది.
ఆదివారం ఉదయం మార్కాపురం బస్టాండ్ నుంచి సుమారు 65 మంది ప్రయాణికులతో బస్సు మాచర్ల వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన 15 నిమిషాలకే దరిమడుగు గుండ్లకమ్మ నది వంతెన దాటిన అనంతరం ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే బస్సు ముందు టైరు ఊడి సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి పడిపోయింది.
టైరు ఊడిపోవడంతో బస్సు ముందు భాగం ఒక్కసారిగా కిందకు వాలిపోయి రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగారు.
సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా తరలించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
బస్సులో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు చోటుచేసుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బస్సు నిర్వహణ, టైర్ల పరిస్థితిపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















