అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో సైనిక సహకారం అందకపోవడంతో సౌదీ అరేబియా అసంతృప్తికి గురవుతోందని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కారెన్ గిబ్సన్ పేర్కొన్నారు. ముఖ్యంగా హూతీ రెబల్స్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)ను నిరాశకు గురిచేసిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరిణామాన్ని ఎంబీఎస్ అంత సులభంగా మర్చిపోరని, అమెరికాతో సంబంధాలపై సౌదీ పునరాలోచించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
హూతీలపై సైనిక చర్య చేపట్టాలని సౌదీ కోరినప్పటికీ.. అమెరికా నేరుగా దళాలను రంగంలోకి దించకుండా ఇంటెలిజెన్స్, ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సహకారానికే పరిమితమైంది. మరోవైపు బ్రిటన్ మాత్రం సౌదీకి మద్దతుగా ముందుకొచ్చింది. సౌదీ దళాల ఆత్మరక్షణ కోసం ఎయిర్-టు-ఎయిర్ రిఫ్యూయలింగ్ సదుపాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వచ్చి కొన్ని వారాల పాటు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా.. హూతీలను ఎదుర్కొనే విషయంలో మరిన్ని మిత్రదేశాలు సౌదీకి మద్దతు ఇవ్వాలని బ్రిటన్ కోరే అవకాశం ఉంది. బాబ్ అల్ మాండెబ్ జలసంధి భద్రతకు హూతీల ముప్పును తొలగించడం కీలకమని బ్రిటన్ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే అమెరికా మాత్రం ఒమన్ మధ్యవర్తిత్వంతో హూతీలతో చర్చలు కొనసాగిస్తోంది. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే దాడులు చేయబోమని హూతీలు హామీ ఇచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం కూడా సౌదీ ఆందోళనకు కారణమైనట్లు సమాచారం.
మరోవైపు యెమెన్‌లోని హూతీ రెబల్స్ ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నారు. బాబ్ అల్ మాండెబ్ జలసంధిపై వారి నియంత్రణపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సౌదీకి 50 ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ విమానాలు సౌదీకి చేరేందుకు కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది.
ఈ పరిణామాల మధ్య గల్ఫ్ దేశాలతో అమెరికా సంబంధాలపై చర్చించేందుకు ట్రంప్ న్యూయార్క్‌లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కీలక ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















