వినియోగదారుల లొకేషన్ డేటాను చట్టబద్ధంగా, పారదర్శకంగా ప్రాసెస్ చేయలేదన్న ఆరోపణలపై గూగుల్‌కు భారీ జరిమానా పడింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) అమెరికా టెక్ దిగ్గజంపై 403 మిలియన్ యూరోలు (దాదాపు రూ.4,400 కోట్లు) ఫైన్ విధించింది.
గూగుల్ వినియోగదారుల బ్రౌజింగ్, సెర్చ్ చరిత్రను ట్రాక్ చేసే ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’తో పాటు, వారు సందర్శించిన ప్రాంతాలను మ్యాప్ చేసే ‘లొకేషన్ హిస్టరీ’లోనూ లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసే విధానాన్ని ఐర్లాండ్ నియంత్రణ సంస్థ పరిశీలించింది. ఈ ప్రక్రియలో యూజర్ల వ్యక్తిగత డేటాను చట్టబద్ధంగా ప్రాసెస్ చేయడంతో పాటు తగిన పారదర్శకత పాటించలేదని దర్యాప్తులో తేలినట్లు DPC తెలిపింది.
అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని ‘లొకేషన్ అక్యూరసీ’ ఫీచర్ ద్వారా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే సమయంలోనూ గూగుల్ తగిన చట్టపరమైన, పారదర్శక విధానాలను పాటించలేదని పేర్కొంది.
ఐరోపాలో గూగుల్‌కు ప్రధాన కార్యాలయం డబ్లిన్‌లో ఉండటంతో 27 దేశాల ఐరోపా కూటమిలో ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆ సంస్థకు ప్రధాన నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఆరేళ్ల క్రితం ప్రారంభమైంది. 2018లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2020 ఫిబ్రవరి వరకు గూగుల్ లొకేషన్ డేటాను ఎలా ప్రాసెస్ చేసిందన్న అంశాలను దర్యాప్తులో పరిశీలించారు.
అయితే ఈ కేసు గతంలో అమల్లో ఉన్న, ప్రస్తుతం నవీకరించిన విధానాలకు సంబంధించినదేనని గూగుల్ వెల్లడించింది. గోప్యతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఐర్లాండ్ నియంత్రణ సంస్థ విధించిన జరిమానాల్లో ఇది నాలుగో అత్యధికం. గతంలో టిక్‌టాక్, మెటా సంస్థలపై దీనికంటే భారీ జరిమానాలు విధించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















