భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) షేర్ మార్కెట్ అవకతవకలపై మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. 2017 నుంచి 2020 మధ్య ఐదు కంపెనీల షేర్ల ట్రేడింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మదుపరి హనీఫ్ షేక్‌తో పాటు మొత్తం 221 సంస్థలు, వ్యక్తులపై చర్యలు ప్రకటించింది.
వీరిపై ఏడేళ్ల పాటు కేపిటల్ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు, మొత్తం రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మౌరియా ఉద్యోగ్, 7ఎన్‌ఆర్ రిటైల్, డార్జిలింగ్ రోప్‌వే, జీబీఎల్ ఇండస్ట్రీస్, విశాల్ ఫ్యాబ్రిక్స్ కంపెనీల షేర్ల ధరలు, ట్రేడింగ్ వాల్యూమ్‌లను ‘పంప్ అండ్ డంప్’ పద్ధతిలో కృత్రిమంగా పెంచినట్లు సెబీ గుర్తించింది.
షేర్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత వాటిని విక్రయించి అక్రమ లాభాలు పొందినట్లు దర్యాప్తులో తేలిందని సెబీ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారానికి హనీఫ్ షేక్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు వెల్లడించింది. మార్కెట్ పారదర్శకతను కాపాడేందుకు ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సెబీ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















