ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ముందస్తు చర్యగా 163 BNSS చట్టాన్ని అమలు చేశారు. ఎన్నికలు ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు సుమారు 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, పోలింగ్ కేంద్రాల వద్ద, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా సహకరించాలని కోరారు. అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















