కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత అథ్లెట్ సీమా కళిరామన్ కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. మూడో రౌండ్‌లో 58.65 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడు ప్రయత్నాల్లో ఫౌల్ చేసినప్పటికీ, ఆమె సాధించిన దూరం కాంస్య పతకానికి సరిపోయింది.
జమైకాకు చెందిన సమంత హాల్ 61.66 మీటర్లతో స్వర్ణ పతకం సాధించగా, కెనడాకు చెందిన జులియా టంక్స్ 60.67 మీటర్లతో రజతం దక్కించుకుంది. సీమా కాంస్యంతో సరిపెట్టుకున్నప్పటికీ, ఆమె సాధించిన విజయం వెనుక ఉన్న పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
హరియాణాకు చెందిన 27 ఏళ్ల సీమా కళిరామన్ కేవలం అథ్లెట్ మాత్రమే కాదు. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. చదువుతో పాటు క్రీడలను కొనసాగిస్తున్న సమయంలోనే ఆమె జీవితంలో మరో కీలక మలుపు వచ్చింది. తల్లిగా మారిన సీమా.. ప్రసవం జరిగిన కేవలం 11 నెలల్లోనే తిరిగి డిస్కస్ త్రో బరిలోకి దిగింది.
ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవడంతో పాటు మళ్లీ పోటీ స్థాయికి చేరుకోవడం కోసం సీమా ఎంతో కష్టపడ్డారు. స్ట్రెంత్, ఫిట్‌నెస్, టెక్నిక్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తన పాత రిథమ్‌ను తిరిగి అందుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు శిక్షణ ఇచ్చింది ఆమె భర్త రవీందర్, జాతీయ స్థాయిలో డిస్కస్ త్రోలో పాల్గొన్న మాజీ అథ్లెట్.
గతేడాది జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సీమా.. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధించే అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు కాంస్య పతకంతో ఆ అంచనాలను నిజం చేసింది. మాతృత్వం తర్వాత కేవలం 11 నెలల్లోనే అంతర్జాతీయ వేదికపై పతకం సాధించడం ఆమె పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















