ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కైకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన మాజీ సర్పంచి గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు కుటుంబసభ్యులకు పరిస్థితిని వివరించారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్‌పై సీపీఆర్ సహా పలు వైద్య సేవలు అందించినప్పటికీ పల్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఆమె మృతిచెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబం ఆమెను అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించడం ప్రారంభించింది.
అయితే మార్గమధ్యంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మండవల్లి మండలం పులపర్రు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన అంబులెన్స్ రోడ్డుపై ఉన్న గుంతలో పడింది. ఈ కుదుపు తర్వాత రామతులసి శరీరంలో కదలిక కనిపించడంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో ఆమెకు కొద్దిపాటి ప్రాణ సంకేతాలు ఉన్నట్లు గుర్తించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యబృందం చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఈ ఘటనతో విషాదంలో ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















