సెరెనా విలియమ్స్.. అమెరికా టెన్నిస్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్రీడాకారిణులలో ఒకరు. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ స్టార్, ఇప్పుడు మళ్లీ రాకెట్ పట్టి కోర్టులోకి దిగేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో ఆమె మళ్లీ కనిపించనుండటం టెన్నిస్ ప్రపంచాన్ని ఉత్సాహంలో ముంచెత్తుతోంది. టోర్నీ నిర్వాహకులు ఇప్పటికే ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు ప్రకటించారు.
మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సెరెనా పునరాగమనంపై వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసింది. “ఇది డ్రిల్ కాదు.. 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెరెనా విలియమ్స్ పోటీ పడనుంది” అంటూ ఆమె చిత్రాన్ని పంచుకుంది. ఇది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.
ఇక ఆమె సోదరి వీనస్ విలియమ్స్‌కూ వింబుల్డన్‌లో డబుల్స్ ఈవెంట్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించడం విశేషం. దీంతో విలియమ్స్ సిస్టర్స్ మళ్లీ అదే వేదికపై కనిపించే అవకాశం టెన్నిస్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సెరెనా చివరిసారిగా 2022 యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ ఆడింది. ఆ తర్వాత ఆమె గ్రాండ్‌స్లామ్‌ల నుంచి దూరంగా ఉండి రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఇటీవల మళ్లీ కోర్టులో అడుగుపెట్టి తన ఫిట్‌నెస్, ఫార్మ్‌ను పరీక్షించుకుంటోంది.
గత వారం క్వీన్స్‌లో కెనడా యువ క్రీడాకారిణి విక్టోరియా ఎబాకోతో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె ఆడిన తొలి మ్యాచ్ ఇదే. అయితే అనుభవం తక్కువగా ఉండటంతో మూడో సీడ్స్ జోడీ నికోలె మెలిచర్ మార్టినెజ్ – రౌటిఫ్ చేతిలో 7-6 (7/2), 6-2 తేడాతో ఓటమి పాలైంది.
అదేవిధంగా బెర్లిన్ ఓపెన్‌లో చెక్ ప్లేయర్ కరోలినాతో కలిసి బరిలోకి దిగిన సెరెనా, అక్కడ కూడా తొలి రౌండ్‌లోనే రౌటిఫ్ – ఓల్మోస్ జోడీ చేతిలో 6-4, 6-4 తేడాతో పరాజయం చవిచూసింది.
అయినప్పటికీ ఆమె పునరాగమనం టెన్నిస్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. సెరెనా తిరిగి తన స్థాయి ఆటను చూపగలదా అన్న ఆసక్తి అభిమానుల్లో భారీగా ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















