ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ షాక్ ఇచ్చింది. ప్రత్యర్థి 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా రాజస్థాన్ దాన్ని ఛేదించేసి పంజాబ్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు డొనోవన్ ఫెరీరా క్షమాపణలు చెబుతున్న వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అసలు సంగతి ఇదీ!
ప్రీతిజింటా సహ యజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ టీమ్ ఐపీఎల్ 2014 సీజన్ క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైంది. అప్పుడు సల్మాన్ ఖాన్.. ‘‘జింటా టీమ్ గెలిచిందా..?’’ అని ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టాడు. పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడల్లా సల్మాన్ పాత ట్వీట్ మళ్లీ తెర పైకి వస్తుంది. ఇప్పుడు ఆ పోస్టుకు ఫెరీరా స్పందించాడు. ‘‘సారీ బ్రదర్.. ఈ రోజు కాదు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















