దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి . ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా పెరిగింది.
ఉదయం 11.01 గంటల సమయంలో సెన్సెక్స్ 939 పాయింట్లు ఎగబాకి, 77,826 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి, 24,284 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.81 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సూచీలో మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
కారణాలివీ..
జపాన్ నిక్కీ మినహా మిగిలిన అన్ని ఆసియా సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. దాంతో మన సూచీలు నిన్నటి నష్టాల నుంచి కోలుకొని లాభాలబాట పట్టాయి. ఇక, బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు 0.21 శాతం తగ్గి, 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారీగా ఇంధన దిగుమతులు చేసుకొనే భారత్‌కు ధరలు తగ్గడమనేది సానుకూలాంశం. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చికి సంబంధించిన లాభాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024-25 ఇదే సమయంతో పోల్చుకుంటే లాభం తగ్గినా.. డిమాండ్ స్థిరంగా ఉంటుందన్న అంచనాలతో మారుతీ సుజుకీ షేర్ 4 శాతం మేర పెరిగింది. మరోవైపు ఎటర్నల్ షేర్ ధర కూడా రెండు శాతం పెరిగింది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















