భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు టీ విరామం అనంతరం శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మానవ్ వేసిన 69వ ఓవర్‌లో రెండో బంతికి కేశర(18) సారాంశ్ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతడి స్థానంలో లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో సోనల్ దినుషా(59) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
టీ విరామ సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం కేశర, సోనల్ భాగస్వామ్యాన్ని భారత్ విడదీసింది. అంతకుముందు పసిందు సూర్యబండార(80)ను రవీంద్ర జడేజా ఔట్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్‌లో డిక్వెలాను మహ్మద్ సిరాజ్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత వర్షం కారణంగా ఆట కొద్దిసేపు ఆలస్యమైంది. అనంతరం సోనల్, కేశర కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేయడంతో శ్రీలంక ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















