పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకునే ఈ విద్యాసంస్థలు మొదట ఇడుపులపాయ, నూజివీడుల్లో మాత్రమే ఉండేవి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఒంగోలు, శ్రీకాకుళంలో మరో రెండు క్యాంపసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే 2016లో RGUKT ఒంగోలు ప్రారంభమైంది.
అయితే, తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ లేకపోవడం విద్యార్థుల ఆవేదనకు కారణమైంది. “త్వరలోనే క్యాంపస్ వస్తుంది” అనే హామీతో ఏటా అడ్మిషన్లు తీసుకుంటూ వస్తున్న యాజమాన్యం, విద్యార్థులను మాత్రం తాత్కాలిక ఏర్పాట్ల మధ్య తిప్పుతూ చదివిస్తోంది.
ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా విద్యార్థులు మొదట రెండేళ్లు ఇడుపులపాయలో, తర్వాత ఒంగోలులో లీజుకు తీసుకున్న రావు అండ్ నాయుడు క్యాంపస్, అనంతరం ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీలో చదవాల్సి వస్తోంది. కోర్సుల అవసరాల పేరుతో ఎప్పుడెక్కడికి పంపిస్తారో కూడా తెలియని పరిస్థితి. అయినా క్యాంపస్ వస్తుందన్న నమ్మకంతో విద్యార్థులు ఏనాడూ నిరసనకు దిగలేదు.
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత సొంత క్యాంపస్ వస్తుందన్న వార్తతో ఆనందపడేలోపే, అది ఒంగోలులో కాకుండా కనిగిరి మండలంలోని బొల్లపల్లి అనే మారుమూల ప్రాంతంలో నిర్మించనున్నట్లు తెలిసి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
“మేము తొమ్మిదేళ్లుగా ఎదురు చూసింది ఇదికోసమా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాలేజీ గేటు ముందు విద్యార్థులు నిరసనకు దిగారు.
“కావాలి కావాలి… ఒంగోలుకే క్యాంపస్ కావాలి”, “We Want Justice” అంటూ నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Aye Jude వంటి యూట్యూబర్లను ట్యాగ్ చేస్తూ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర ట్రిపుల్ ఐటీ క్యాంపసుల విద్యార్థులు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు.
కాలేజీ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్న ప్రభుత్వ ఆలోచన ఉండొచ్చని ఒప్పుకుంటూనే, “మా తొమ్మిదేళ్ల నిరీక్షణకు ఇదేనా సమాధానం?” అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తరచూ కాలేజీని మారుస్తూ ఉంటే తమ పరిస్థితి ఏంటని లెక్చరర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొత్త క్యాంపస్‌ను నిర్మించాలనుకుంటున్న బొల్లపల్లి ప్రాంతం ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న ప్రాంతమని సమాచారం. ఏడాదికి సుమారు వెయ్యి మంది చొప్పున, ఆరు సంవత్సరాల్లో 6000 మందికి పైగా విద్యార్థులు ఉండే ఈ సంస్థను అలాంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఉచిత విద్య పథకం కింద రావాల్సిన నిధులు కూడా సమయానికి విడుదల కావడం లేదని వారు వాపోతున్నారు. ఇలా కొనసాగితే చివరకు తమ సొంత ఖర్చులతోనే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమల మధ్య తిరుగుతూ భవిష్యత్తు శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు, ఈ సమయంలో మారుమూల ప్రాంతంలో కనీస సదుపాయాలు లేక ఫ్లోరిన్ నీళ్ల భయంతో జీవించాలా? అని ప్రశ్నిస్తున్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















