అనుకోకుండా టీ20 ప్రపంచ కప్ 2026లో ఆడే అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2024 ఎడిషన్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో 11 మందికి ఈసారి కూడా చోటు దక్కింది.
ఆటగాళ్లకు గాయాల వంటి అనుకోని పరిస్థితులు ఎదురైతే వెంటనే జట్టులోకి తీసుకునేందుకు ఇద్దరిని ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా, మరో ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. గ్రూప్ ‘సి’లో ఉన్న స్కాట్లాండ్, ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అలాగే ఫిబ్రవరి 17న ముంబయిలో నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేశారు. ఇప్పటివరకు స్కాట్లాండ్ ఆరు సార్లు (2007, 2009, 2016, 2021, 2022, 2024) టీ20 ప్రపంచ కప్‌ల్లో పాల్గొంది. 2021లో సూపర్-12 దశకు చేరడం ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
తమకంటే బలమైన జట్లను ఓడించిన ఘన చరిత్ర స్కాట్లాండ్‌కు ఉంది. 2021 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ను, 2022లో వెస్టిండీస్‌ను ఓడించింది. 2024లో ఆస్ట్రేలియాను కూడా ఓడించేంత పని చేసింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈసారి అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఈ జట్టు ఎవరికెవరికీ షాక్ ఇస్తుందో చూడాల్సిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం స్కాట్లాండ్ జట్టు:
రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

Accident Alert Andhra pradesh Andhrapradesh BreakingNews Breaking news BreakingNewsTelugu Business Chandrababu naidu Climate Cricket Crime News Delhi Development Devotion Devotional Farmers Flood Government Heavy rains High court Hyderabad India Investment Karthika masam Mantha Toofan Movie Nara Lokesh Naralokesh News PM Modi Police Politics Review Road accident Sports Srikakulam Tdp Telangana Toofan Vijayawada Warning Weather YCP YSRCP


















