టాటా ట్రస్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో తమ దాతృత్వ వ్యయాలను రూ.2,000 కోట్లకు పెంచనున్నట్లు సీఈఓ సిద్ధార్థ్ శర్మ తెలిపారు. వివిధ అంశాలపై ట్రస్ట్స్ సభ్యుల్లో గందరగోళం నెలకొందంటూ వస్తున్న మీడియా కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు.
సుమారు 180 బిలియన్ డాలర్లకు పైగా విలువైన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ పూర్తిగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉందని ఆయన గుర్తుచేశారు. ట్రస్ట్స్ లక్ష్యాలు, సేవా కార్యక్రమాల పురోగతిని వివరించేలా ఆయన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరణ ఇచ్చారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్ట్స్ దాతృత్వ కార్యక్రమాలకు రూ.1,600 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.2,000 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధి రంగాలకు వినియోగించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సామాన్యులకు అందుబాటు ధరల్లో క్యాన్సర్ చికిత్స సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. అలాగే దేశంలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్య కోసం అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీ స్థాపనపై ప్రముఖ విద్యాసంస్థతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
మధ్య భారత్‌లో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో కూడా టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యం వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రస్ట్స్‌లో అంతర్గత వివాదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ, మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించకుండా కథనాలు ప్రచురించడం దురదృష్టకరమని సిద్ధార్థ్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్స్ 122 ఏళ్లుగా ఎటువంటి ప్రచారం లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















