మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఈగల్ ఫోర్స్ చేపట్టిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. కేంద్రం నిర్దేశించిన ఏడు కీలక ప్రమాణాల్లో 80 శాతానికిపైగా మార్కులు సాధించిన తెలంగాణకు జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది.
న్యూఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో మూడో జాతీయస్థాయి యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అధిపతుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జాతీయస్థాయి పురస్కారాన్ని అందించారు.
యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ల పనితీరును కేంద్రం ఏడు అంశాల ఆధారంగా అంచనా వేసింది. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ప్రీకర్సర్ కెమికల్స్, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ, కేసుల ప్రాసిక్యూషన్, డిమాండ్ తగ్గింపు-హార్మ్ రిడక్షన్, సమన్వయం-సామర్థ్య పెంపు, పరిశోధన-విశ్లేషణ, పరిపాలన-లాజిస్టిక్స్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
డ్రగ్స్ కేసుల్లో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కోసం తెలంగాణలో న్యాయపరమైన పరిశీలన, జ్యుడీషియల్ అనాలిసిస్, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్ సహకారం వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈగల్ ఫోర్స్, జిల్లా పోలీస్ యూనిట్ల సమన్వయంతో మాదకద్రవ్యాల రవాణా, నెట్‌వర్క్‌లపై చర్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ గుర్తింపుపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు దర్యాప్తు, ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్‌లపై చర్యలు, నిరోధక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















