ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కుర్వపల్లి తండాకు చెందిన కాట్రావత్ సురేశ్ (26) ఉస్మానియా వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ పీజీ చదువుతున్నారు. మూడు నెలల క్రితం ఆయన కోర్సులో చేరి వసతిగృహంలో ఉంటున్నారు.
సురేశ్ జనరల్ మెడిసిన్‌లో చేరాలని భావించినప్పటికీ ర్యాంకు తక్కువ రావడంతో సర్జరీ విభాగంలో చేరాల్సి వచ్చిందని తెలుస్తోంది. కోర్సు ఒత్తిడి, మానసిక సమస్యలతో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుటుంబం తెలిపింది.గురువారం ఉదయం ఆయన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే వసతిగృహ గదిలో నిద్రమాత్రలు, మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తోటి విద్యార్థులు గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తమ కుమారుడి మృతికి సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలోనే ర్యాగింగ్ గురించి తనకు చెప్పాడని, ఫిర్యాదు చేస్తే వేధింపులు పెరుగుతాయని భయపడ్డాడని తల్లి నాగమణి తెలిపారు.ఘటనపై గిరిజన సంఘాలు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















