అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG)కు భారీ నష్టం నమోదైంది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సంస్థకు 238 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వచ్చినట్లు కంపెనీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి సంస్థ నష్టం దాదాపు 10 రెట్లు పెరిగింది. మరోవైపు కంపెనీ ఆదాయం మాత్రం ఏడాది క్రితంతో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగినప్పటికీ.. నష్టాల నుంచి బయటపడలేకపోయింది. డిజిటల్ కరెన్సీ మార్కెట్‌లో చోటుచేసుకున్న పతనం, క్రిప్టో ఆస్తుల విలువలు తగ్గడం సంస్థ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
భారీ నష్టాల నేపథ్యంలో సంస్థ భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై దృష్టి సారిస్తోంది. వాటాదారుల విలువను పెంచే కొత్త వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్, క్రిప్టో సంబంధిత కార్యక్రమాల కంటే సోషల్ మీడియా వ్యాపారంపైనే మళ్లీ ఎక్కువ దృష్టి పెట్టాలని సంస్థ భావిస్తోంది.ట్రూత్ సోషల్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడంతో పాటు మరింత మంది వినియోగదారులను ఆకర్షించేలా ప్లాట్‌ఫామ్‌ను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
ట్రూత్ ఏపీఐతో కొత్త ఆదాయం:
మరోవైపు ట్రంప్ మీడియా ట్రూత్ ఏపీఐపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ట్రూత్ సోషల్‌లో ప్రముఖ వ్యక్తులు చేసే పోస్టులను ఇతర వినియోగదారుల కంటే ముందుగానే తెలుసుకునే అవకాశం ఈ సేవ ద్వారా లభిస్తుంది. ఇందులో ట్రంప్ పోస్టులకు కూడా ముందస్తు యాక్సెస్ ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడి పోస్టులు, ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమాచారానికి ట్రేడింగ్ సంస్థల్లో డిమాండ్ ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది.
ట్రూత్ ఏపీఐ సేవలకు సంస్థ నెలకు 60 వేల నుంచి 1 లక్ష డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్లు మెక్‌గర్న్ తెలిపారు. ఇప్పటికే 10 సంస్థలతో ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. వీటిలో అత్యంత వేగంగా షేర్ల కొనుగోలు, విక్రయాలు నిర్వహించే హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ఈ సేవలను కేవలం ట్రేడింగ్ సంస్థలకే పరిమితం చేయకుండా డేటా సెంటర్ కంపెనీలు, వార్తా సంస్థలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ మీడియా భావిస్తోంది. దీంతో భారీ నష్టాల మధ్య కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్న సంస్థకు ట్రూత్ ఏపీఐ కీలకంగా మారే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















