పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈలో రహస్యంగా పర్యటించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది.
నెతన్యాహు మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ సైనిక బృందం కూడా తమ దేశాన్ని సందర్శించలేదని యూఏఈ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌తో తమ సంబంధాలన్నీ పూర్తిగా బహిరంగంగానే కొనసాగుతున్నాయని, అబ్రహం ఒప్పందాల పరిధిలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
యూఏఈ అధికారిక మీడియా ప్రకారం, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించని ఏ రహస్య పర్యటన వార్తలైనా నిరాధారమైనవేనని వెల్లడించింది. మరోవైపు నెతన్యాహు కార్యాలయం మాత్రం ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారని తెలిపింది.ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ వార్తలు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















