శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని దోపిడీపై దర్యాప్తు చేయమని ఎలా చెప్పగలమని నర్మగర్భంగా ప్రశ్నించారు.
ముంబయిలో ఆదివారం ‘రామ్ రక్ష’ పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అయోధ్య అంశంపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. హిందుత్వాన్ని దుర్వినియోగం చేసి ఆలయాన్ని ఎవరైనా దోచుకుంటే హిందువులు క్షమించరని స్పష్టం చేశారు. రాముడు అందరివాడని పేర్కొంటూ ‘భాజపా రహిత రాముడి’ కోసం ప్రయత్నించాలంటూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రాలను పఠించారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఇన్నాళ్ల తర్వాత అయినా ఠాక్రేకు రాముడు గుర్తుకు రావడం సంతోషకరమని దాదర్‌లో వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















