ఉన్నత ఉద్యోగాలు, ఆకర్షణీయ వేతనాలు పొందడానికి తప్పనిసరిగా పెద్ద చదువులే అవసరం లేదని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీలతోనే మంచి కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోర్సుల్లో వైవిధ్యమైన సబ్జెక్టు కాంబినేషన్లు, కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉంది. సుమారు 400కు పైగా సబ్జెక్టు కాంబినేషన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండటం ఈ కోర్సుల ఆకర్షణను పెంచుతోంది. తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధి, పోటీ పరీక్షలకు అనుకూలత వంటి కారణాలతో ఇవి మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి.బీఏ కోర్సులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులు అత్యంత పాపులర్‌గా ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ పరీక్షలకు ఇది బలమైన పునాది. బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఇప్పుడు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులు చేరాయి.
బీకామ్‌లో కూడా అకౌంటింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఏసీసీఏ, సీఎంఏ వంటి అంతర్జాతీయ కోర్సులతో కలిపి డిగ్రీలను అందిస్తున్నాయి.నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ విధానం ద్వారా విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులో మరింత లోతైన ప్రావీణ్యం పొందే అవకాశం ఉంది. సరైన సబ్జెక్ట్ కాంబినేషన్ ఎంపిక చేసుకుంటే డిగ్రీతోనే మంచి కెరీర్ అవకాశాలు, ఉన్నత విద్యకు బలమైన మార్గం లభిస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















