కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. రానున్న ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా మరో ఆరు విమానాశ్రయాల్లో ఈ సేవలను విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి దశలో వారణాసి నుంచి ఎయిరిండియా ఈ సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ మోడల్ ద్వారా భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నగరాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణికులు ఇకపై ఢిల్లీ వంటి ప్రధాన విమానాశ్రయాల ద్వారా సులభంగా కనెక్ట్ అవుతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు కేంద్రమంత్రి స్వయంగా బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఈజీ కనెక్ట్ సర్వీస్ కింద తొలి AI1111 విమానం వారణాసి నుంచి ఉదయం 9.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది.
ఎయిరిండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ, ఈజీ కనెక్ట్ ఫ్లైట్ సేవలను త్వరలోనే హైదరాబాద్, చెన్నై, అమృత్‌సర్, కొచ్చి, గోవా నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ సేవల ద్వారా ప్రయాణికులు మొదటి ఎయిర్‌పోర్టులోనే బ్యాగేజీ మరియు ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
హబ్ అండ్ స్పోక్ ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు. ఈ విధానం ద్వారా చిన్న నగరాల ప్రజలకు ప్రపంచవ్యాప్త గమ్యస్థానాలు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి మాత్రమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా దోహదపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















