ఉత్తర్‌ప్రదేశ్‌లో అకాల వర్షాలు, తీవ్రమైన గాలిదుమారం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. 114 పశువులు మరణించాయి, 87 ఇళ్లు ధ్వంసమయ్యాయి అని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
ప్రయాగ్‌రాజ్, భదోహి, ఫతేపుర్, సోన్‌భద్ర, మీర్జాపుర్ వంటి జిల్లాల్లో వడగళ్ల వాన, పిడుగులు తీవ్ర నష్టం కలిగించాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బరేలీలో గాలి తీవ్రతకు ఓ వ్యక్తి షెడ్డుతో సహా ఎగిరిపడిన ఘటన వైరల్‌గా మారింది. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వాతావరణ శాఖ ప్రకారం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతోనే ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. మే నెలలో సాధారణంగా ఉండే వేడి గాలులు తేమతో కలిసి ఇలాంటి పెను తుఫాన్ పరిస్థితులకు దారితీస్తాయని అధికారులు వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















