Imran Khanను పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి తొలగించడంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను United States ఖండించింది. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ.. పాకిస్థాన్ అంతర్గత రాజకీయాల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ దౌత్యవేత్త అసద్ మజీద్ ఖాన్, అమెరికా మాజీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ Donald Lu మధ్య జరిగిన సంభాషణను ఓ పాకిస్థానీ ఇన్వెస్టిగేటివ్ పత్రిక ఇటీవల ప్రచురించింది. ఇందులో ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించాలని చర్చించినట్లు కథనాలు వెలువడ్డాయి.ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి స్పందిస్తూ.. “పాక్ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవి. ఇమ్రాన్ ఖాన్ తొలగింపులో అమెరికా పాత్ర ఉందన్న వార్తలు నిజం కావు” అని పేర్కొన్నారు.
అయితే, లీకైన దౌత్య సమాచారంలో ఉన్న నిర్దిష్ట అంశాలపై ఆయన ప్రత్యక్షంగా స్పందించలేదు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇమ్రాన్ తటస్థ వైఖరి కారణంగానే ఆయనను పదవి నుంచి తప్పించాలని అమెరికా భావించిందని పాకిస్థాన్‌లో అప్పట్లో లీకైన దౌత్య సమాచారం పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















