యువ సంచలనం Vaibhav Suryavanshi త్వరలోనే భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం అతనికి ఉన్నట్లు తాజా సమాచారం.ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం Sachin Tendulkar పేరిట ఉంది. అయితే వైభవ్ జట్టులోకి వస్తే ఆ రికార్డు అతనిదే అయ్యే అవకాశముందని చర్చ జరుగుతోంది.
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, రాబోయే ఐర్లాండ్ సిరీస్ కోసం భారత జట్టు షార్ట్‌లిస్ట్‌లో వైభవ్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో అతని దూకుడైన ప్రదర్శన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఈ 15 ఏళ్ల బ్యాటర్ ఇప్పటికే తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తూ భవిష్యత్ స్టార్‌గా నిలుస్తున్నాడు.
జూన్‌లో జరిగే ఐర్లాండ్ పర్యటన కోసం భారత జట్టు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సెలక్టర్లు అతని ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నారని, ఎమర్జింగ్ టోర్నీల్లో చూపిన ప్రదర్శన కారణంగా ఎంపికకు బలమైన అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం దక్కితే, తర్వాత జింబాబ్వే సిరీస్‌కూ అతను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో భారత క్రికెట్‌లో కొత్త యువ స్టార్ ఎదుగుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















