కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సీఎం సతీశన్ ఆర్థిక, ఓడరేవుల శాఖలతో పాటు పలు కీలక శాఖలను తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు విజిలెన్స్‌తో పాటు హోం శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూ శాఖ కేటాయించాలని యూడీఎఫ్ నిర్ణయం తీసుకుంది.
సతీశన్ రాజకీయ ప్రస్థానం
కొచ్చికి సమీపంలోని నెట్టూర్‌లో 1964లో జన్మించిన వీడీ సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానం కేరళ విద్యార్థి విభాగం (KSU) ద్వారా ప్రారంభమై, తర్వాత యూత్ కాంగ్రెస్‌లో కొనసాగింది.
2001లో పరావుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి, వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2021లో యూడీఎఫ్ ప్రతిపక్షానికి పరిమితమైన సమయంలో ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అవినీతి, పాలనాపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పార్టీలో ఆయనకు బలమైన మద్దతు ఏర్పడి, సీఎం ఎంపికలో ఆయనకు ప్రాధాన్యం దక్కింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















