ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా మరణంతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 84 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇటీవల విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచారం.
1941 జులై 17న జన్మించిన భారతీరాజా, 1977లో వచ్చిన తమిళ చిత్రం ‘16 వయథినిలే’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం తెలుగులో ‘పదహారేళ్ల వయసు’గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన, ఇక్కడ కూడా తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందారు.
సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. భారతీరాజా మొత్తం ఆరు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా లభించింది.
అంతేకాకుండా ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి కథ అందించగా, ‘పల్నాటి పౌరుషం’కు స్క్రీన్‌ప్లే రచించారు. ఆయన చివరిసారిగా మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో నటుడిగా తెరపై కనిపించారు. భారత ప్రభుత్వం 2004లో ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఇటీవల తీవ్ర విషాదం ఎదురైంది. గతేడాది ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన తీవ్రంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరణం సినీ వర్గాల్లో విషాదాన్ని మరింత పెంచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















