వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ కుదరవల్లి ఇటీవల అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన ‘అతి విశిష్ట సేవా మెడల్’ను అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
శ్రీనివాస్ కుదరవల్లి విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో అడ్మిరల్ సూపరింటెండెంట్ (ఏఎస్‌డీ)గా, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్స్ (డీజీఎన్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారత నౌకాదళంలో ఆయన సేవలు అత్యంత ప్రాధాన్యం కలవిగా గుర్తింపు పొందాయి.
1968లో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన శ్రీనివాస్ 1990లో భారత నౌకాదళంలో చేరారు. తన సేవా కాలంలో అనేక కీలక ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ముఖ్యంగా ‘ఐఎన్‌ఎస్ విరాట్’ నౌకలో సేవలందించడంతో పాటు, ‘ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య’ యుద్ధనౌక పునరుద్ధరణ పనుల్లో కూడా సమర్థవంతమైన పాత్ర పోషించారు.
నౌకాదళ ఆధునీకరణ, ప్రాజెక్టుల నిర్వహణలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















