Vijay తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి ప్రసంగంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చెన్నైలోని Jawaharlal Nehru Indoor Stadium లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం భావోద్వేగంతో మాట్లాడిన విజయ్, ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ ద్రోహం చేయనని హామీ ఇచ్చారు.
“ప్రభుత్వ పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. లౌకికవాద, సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం” అని విజయ్ పేర్కొన్నారు. విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సేవలు వంటి మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ప్రజాధనాన్ని కాపాడటం తన మొదటి బాధ్యత అని చెప్పిన విజయ్, “ప్రజల డబ్బు ఒక్క పైసా కూడా తాకను. అది నాకు అవసరం లేదని అందరికీ తెలుసు” అని స్పష్టం చేశారు. అవినీతి లేదా అక్రమాలకు తన ప్రభుత్వంలో ఎలాంటి స్థానం ఉండదని, తప్పు చేసినవారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టబోనని హెచ్చరించారు.తన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, “గెలిచాం కదా.. ఇప్పుడు ఆట ఆడదాం అనే ఆలోచన ఎవరైనా పెట్టుకుంటే వెంటనే మార్చుకోవాలి” అని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా విజయ్ స్పందించారు. తమిళనాడుకు భారీగా అప్పులు ఉన్నాయని, రాష్ట్ర ఖజానా పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రజలకు అసత్య హామీలు ఇవ్వబోనని, పారదర్శక పాలన అందిస్తానని చెప్పారు.మైనారిటీలకు పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చిన విజయ్, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా మీరు నా వెంట నిలిచారు. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















