విశాఖపట్నంలో ఓ బాలికను హతమార్చి, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి ఒడిశాలోని రాయగడ సమీపంలో పడేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో విశాఖకు చెందిన ఆటోడ్రైవర్ బొలిశెట్టి సురేష్ (32)ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌కు చెందిన సురేష్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం రైల్వేస్టేషన్, బస్టాప్‌ల వద్ద భిక్షాటన చేస్తున్న ఓ బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. తనకు ఎవరూ లేరని బాలిక చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అనంతరం బాలిక తనను పెళ్లి చేసుకోవాలని సురేష్‌పై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 15న బాలిక సురేష్ ఇంటికి వెళ్లి గొడవ పడగా.. ఆ సమయంలో అతడు ఆమెపై దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో ఉంచి జ్ఞానాపురం రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశాలోని రాయగడకు చేరుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.రాయగడలోని చాందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ట్రాలీ బ్యాగ్‌ను పడేసి తిరిగి రైలులో విశాఖకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మూడు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రాలీ బ్యాగ్‌ను తెరిచి మృతదేహాన్ని గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు, ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించారు. అనంతరం విశాఖకు చేరుకుని కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని చాందిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















