విశాఖపట్నంలో ఫ్లాట్ వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్ దారుణంగా మృతి చెందారు.
వివరాల ప్రకారం.. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఐదుగురు యువకులు కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. మూడు రోజుల క్రితం వారు ఫ్లాట్‌ను ఖాళీ చేశారు. అయితే ఫ్లాట్‌లోని సామగ్రిని పాడు చేశారన్న కారణంతో యజమాని దుర్గాప్రసాద్ వారిని పిలిపించి ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆయనతో మాట్లాడేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో దుర్గాప్రసాద్, యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరు యువకుల్లో ఒకరు దుర్గాప్రసాద్‌పై దాడి చేసినట్లు సమాచారం.
దాడిలో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అసలు ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడి ఎలా జరిగింది, మృతికి కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















