ఇంగ్లాండ్ వేదికగా జూన్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలుకానుంది. ఇప్పటికే టీమ్‌ఇండియాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన భారత్ మంచి జోష్ మీదుంది. తాము రెండో కప్‌ను గెలుచుకోవాలని అనుకుంటున్నట్లు మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. అమోల్ మజుందార్‌తో కలిసి ఆమె ఐఐఎస్‌ఎంలో డిగ్రీల ప్రదాన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా టీమ్ ప్రిపరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘మేం ఇంతకుముందు ఒక ఐసీసీ ట్రోఫీ నెగ్గాం. రెండో దానిని కైవసం చేసుకోవాలనే స్ఫూర్తితో బరిలోకి దిగుతాం. మా సన్నద్ధత చాలా బాగుంది. ఇదేమీ స్క్వాడ్ ప్రకటన అనంతరం మొదలుకాలేదు. గతేడాది వన్డే ప్రపంచ కప్ తర్వాతనే ప్రారంభించాం. శ్రీలంకతో సిరీస్ సమయంలో మా కోచ్ అమోల్ మజుందార్ ఓ మాట చెప్పారు. ‘ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో తొలి రోజు మొదలవుతోంది. అదే లక్ష్యంతో ప్రతి మ్యాచ్ ఆడాలి’ అని అన్నారు. జట్టులోని ప్రతి క్రికెటర్ ఇదే భావనతో ఉన్నాం. నందని ఈసారి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నా. ఏదో ఒక మ్యాచ్‌లో బాగా ఆడి ఆమె తనను ప్రూవ్ చేసుకోలేదు. మొదట్నుంచి నిలకడగా ఆడుతోంది. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్లు ఉన్నారు. వారి నేతృత్వంలో భారీ వేదికపై మెరుపులు మెరిపిస్తుందని ఆశిస్తున్నా’’ అని జెమీమా తెలిపింది.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ప్రయాణం జూన్ 14న పాకిస్థాన్ మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ గ్రూప్‌లో ఈ రెండు జట్లు మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక కూడా ఉన్నాయి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















