ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తదుపరి మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్ కోసం జట్టు రాయ్‌పుర్ బయలుదేరినప్పటికీ, హార్దిక్ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం చర్చనీయాంశమైంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ దూరమైనట్లు తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే మ్యాచ్ అనంతరం ఓపెనర్ రికెల్టన్ హార్దిక్ గాయంపై స్పష్టత లేకపోవడం గందరగోళాన్ని పెంచింది.
ఇదే నేపథ్యంలో రవాణా సమస్యల వల్లే హార్దిక్ రాయ్‌పుర్ వెళ్లలేదని, ఆర్సీబీ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండటంతో అతను త్వరలోనే జట్టుతో కలిసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కానీ అతని ఫిట్‌నెస్‌పై అధికారిక సమాచారం లేకపోవడంతో అనుమానాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడడంపై సందేహం నెలకొంది. హార్దిక్ లేని సమయంలో జట్టును నడిపిన సూర్యకుమార్ వ్యక్తిగత కారణాలతో ఆర్సీబీ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కీలక మ్యాచ్‌కు ముందు ముంబయి జట్టులో నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















