భారత ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ సానుకూల అంచనాలు వెల్లడించింది. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.5% వరకు ఉండే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. బలమైన దేశీయ డిమాండ్, వినియోగదారుల ఖర్చులు, పెట్టుబడుల పెరుగుదల భారత వృద్ధికి ప్రధాన కారణాలవుతాయని తెలిపింది.
ఫిచ్ అంచనాల ప్రకారం, వినియోగదారుల వ్యయం 8.6%, పెట్టుబడులు 6.9% వరకు పెరగొచ్చని పేర్కొంది. గతంలో డిసెంబరులో విడుదల చేసిన అంచనాల్లో 2025-26లో 7.4% వృద్ధి ఉంటుందని చెప్పగా, ఇప్పుడు దాన్ని 7.5%కు పెంచింది. అదే సమయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 6.7%కు పెంచింది.
ఇక అంతర్జాతీయ ముడిచమురు ధరల విషయానికొస్తే, 2026లో బ్యారెల్‌కు సగటు ధర 70 డాలర్లుగా ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. అయితే ఇటీవల ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్ల వరకు చేరాయి. హర్మూజ్ జలసంధి పరిస్థితుల కారణంగా ఈ నెలలో చమురు ధరలు 90–100 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
అయితే సంవత్సర ద్వితీయార్థంలో ధరలు తగ్గి బ్యారెల్‌కు 60 డాలర్ల పరిధికి చేరే అవకాశం ఉందని, అందువల్ల 2026 సంవత్సరానికి సగటు ధర 70 డాలర్లుగా ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది.
ఇక ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై కూడా ఫిచ్ అంచనాలు వెల్లడించింది. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధి 2.6% మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద స్థిరంగా ఉంటే, ప్రపంచ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఫిచ్ ముఖ్య ఆర్థికవేత్త బ్రియాన్ కౌల్టన్ హెచ్చరించారు.
భారత ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే, జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు కొంత నెమ్మదించినప్పటికీ, మొత్తం వ్యవస్థ పటిష్ఠంగానే కొనసాగుతోందని ఫిచ్ తెలిపింది. బ్యాంకు రుణాల వృద్ధి ఇప్పటికీ రెండంకెల స్థాయిలో కొనసాగుతుండటం ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తోందని పేర్కొంది.
ఇక 2026 డిసెంబరు నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% వరకు పెరగొచ్చని అంచనా వేసింది. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును 5.25% వద్దే కొనసాగించే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది.
అదనంగా, జాతీయ ఖాతాల గణాంకాల్లో బేస్ ఇయర్‌ను 2011–12 నుంచి 2022–23కు మార్చడం వల్ల భారత జీడీపీ వృద్ధి మరింత స్థిరంగా కనిపిస్తున్నట్లు ఫిచ్ తన నివేదికలో వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















