ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ తన అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోతే పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
స్థానికంగా నిర్వహించిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో అన్ని పనులు పారదర్శకంగా, సమర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు.గండికోట జలాశయం ముంపు బాధితుల త్యాగం వల్లే ఆ ప్రాంతాలకు నీరు అందుతోందని పేర్కొన్నారు. తాడిపత్రి, పైడిపాలెం, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైలవరం ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
రాజోలి నిర్మాణం, గండికోట ముంపు బాధితులకు పెండింగ్ పరిహారం, శ్రీశైలం కుడి కాలువ పనులు, అలాగే ఆర్టీపీపీ లో ఉద్యోగ అవకాశాల అంశాలపై కూడా పోరాటం కొనసాగిస్తున్నట్లు వివరించారు.తనకు పార్టీ పదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, అవసరమైతే రాజీనామా చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. మంచి పనులకు స్పందన లేకపోతే పార్టీ బలపడదని వ్యాఖ్యానించారు.అదేవిధంగా, గత వైకాపా ప్రభుత్వ కాలంలో తనపై అనేక కేసులు నమోదు చేసి రాజకీయంగా వేధించారని ఆరోపించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















