కృష్ణా జిల్లా మోపిదేవిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. పులిగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ వద్ద విజయవాడ కరకట్ట బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నప్పటికీ, డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో ఆమె పరిచయస్తుడి ద్విచక్ర వాహనంపై మోపిదేవి టోల్‌ప్లాజా సమీపంలోని బస్టాప్ వరకు వెళ్లి మరోసారి బస్సును ఆపాలని ప్రయత్నించారు. అక్కడ కూడా డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో ఆమె కోపం మరింత పెరిగింది.
తర్వాత మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం వద్ద బస్సు ఆగినప్పుడు, మహిళ డ్రైవర్ వద్దకు వెళ్లి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. ఈ సమయంలో డ్రైవర్ అసభ్య పదజాలంతో స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఆగ్రహం అదుపు చేయలేక మహిళ డ్రైవర్‌ను చెప్పుతో కొట్టింది.
అంతటితో ఆగకుండా, ఆమె ఫోన్ ద్వారా తన బంధువును చల్లపల్లి బస్టాండ్ వద్దకు పిలిపించి, ఆయనతో కలిసి మరోసారి డ్రైవర్‌పై దాడి చేయించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. దాడి చేసిన మహిళ ఓ కానిస్టేబుల్ భార్యగా గుర్తించబడినట్లు తెలుస్తోంది. అయితే పరస్పర రాజీతో ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని సమాచారం. ఈ సంఘటన ప్రజా రవాణా సిబ్బంది భద్రత, ప్రయాణికుల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారి తీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















