ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న వారికి ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా ‘వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అడ్మిషన్లు’ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. దీని ద్వారా అర్హత కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే యూజీ, పీజీ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.
ఏఐసీటీఈ అనుమతులు పొందిన కళాశాలలు ఈ విధానంలో కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ విధానంలో చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగకరంగా మారనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















