సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (యూవీ) కిరణాల నుంచి భూమిపై జీవరాశులను రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుంది. భూమికి 18 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే స్ట్రాటో ఆవరణంలోని 25–40 కిలోమీటర్ల మధ్య ఓజోన్ అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని భూమికి సహజ రక్షణ కవచంగా పరిగణిస్తారు.
మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడే ఓజోన్ అత్యంత ప్రతిచర్యాత్మకమైన వాయువు. స్ట్రాటో ఆవరణంలో సూర్యుడి యూవీ వికిరణం కారణంగా ఆక్సిజన్ నుంచి సహజసిద్ధంగా ఓజోన్ ఏర్పడుతుంది. ఫ్రెంచి భౌతికశాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి, హెన్రీ బుయేసన్ 1913లో ఓజోన్ పొరను గుర్తించారు.
మానవ కార్యకలాపాల కారణంగా ఓజోన్ పొర క్షీణించడం 1980లలో స్పష్టంగా గుర్తించారు. 1985లో అంటార్కిటికాపై ఓజోన్ పొరలో భారీ రంధ్రాన్ని గుర్తించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఓజోన్ పొర బలహీనపడితే హానికరమైన యూవీ కిరణాలు భూ ఉపరితలాన్ని ఎక్కువగా చేరే ప్రమాదం ఉంటుంది.
ఓజోన్ పొర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబరు 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొరను రక్షించేందుకు మాంట్రియల్ ప్రొటోకాల్, బహుళపక్ష నిధి, కిగాలి సవరణ వంటి అంతర్జాతీయ చర్యలు కూడా కీలకంగా నిలిచాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















